వెంకటేశ్వర స్వామి రథం దగ్ధం

Sri Prasanna Venkateswara Swami Temple

నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట కొండపై కొలువైన శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి రధాన్ని గుర్తు తెలియని దుండగులు తగలపెట్టారు. వెంకటేశ్వర స్వామి రథం శుక్రవారం తెల్లవారు జామున దగ్ధమైంది. ఆలయ ఆవరణలో నిలిపి ఉంచిన ప్రాచీన రథంలో అర్ధరాత్రి మంటలు చెలరేగడం గమనించిన స్థానికులు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు వ్యాపించి రథం పూర్తిగా కాలిపోయింది. 

ఈ ఘటనపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణిని ఆదేశించారు. భక్తులెవరు ఆందోళన చెందవద్దని మంత్రి అన్నారు. ఆకతాయిల చర్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.