పుల్వామా దాడి..: రాహుల్‌గాంధీ ప్రశ్నలు

rahul gandhi

పుల్వామా దాడి జరిగి నేటికి ఏడాది. ఈ సందర్భంగా పై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ కేంద్రానికి ప్రశ్నలు సందించారు. ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ ప్రశ్నించారు. 40 మంది జవాన్లు బలిగొన్న పుల్వామా దాడి వల్ల ఎవరు లాభ పడ్డారు?. విచారణలో ఇప్పటి వరకు ఏం తేల్చారు?. భద్రతా వైఫల్యానికి బీజేపీ ప్రభుత్వంలో ఎవరు బాధ్యత వహిస్తారు? అని  రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఫిబ్రవరి 14.. గతేడాది ఇదే రోజున దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజు. జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద... కారుతో  ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు మరణించారు. 35 మంది  జవాన్లు గాయపడ్డారు