ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ పై కేంద్రానికి సమాచారం ఇచ్చారా..?: క్యాట్

ab venkateswara rao

సస్పెన్షన్ కు గురైన ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఆదేశించింది. తన సస్పెన్షన్ చట్ట విరుద్ధమంటూ ఏబీ వెంకటేశ్వర రావు నిన్న క్యాట్ లో పిటిషన్ వేయగా దాన్ని విచారించిన న్యాయమూర్తి ఏపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేశారు. ఏబీ వెంకటేశ్వర రావు సస్పెన్షన్ పై కేంద్రానికి సమాచారం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఈ నెల 24 న తుది విచారణ చేస్తామని క్యాట్ తెలిపింది. ఈ లోగ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.