జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ 28కి వాయిదా

jagan case

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 28కి వాయిదా పడింది. సీబీఐ కేసులో వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. సీబీఐ, ఈడీ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణలో ఇవాళ్టి హాజరు నుంచి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి మినహాయింపు లభించింది. మినహాయింపుపై ఆయనకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. కాగా తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, రాజగోపాల్‌, మరో ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరయ్యారు.