రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది

lokesh comments on jagan

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అని లోకేష్ అన్నారు. ఈ మేరకు లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఇన్ఫ్రా కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఆ కంపెనీల్లో జరిగిన రైడ్స్ కి టిడిపి కి ముడిపెట్టి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా అలాంటి కోరికలు మాకు లేవు. అని పేర్కొన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది అన్న భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్ కి టిడిపికి ముడి పెట్టాలని తెగ తాపత్రయపడుతున్నారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్ గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఐటీ రైడ్స్ లో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్ధమైంది. అని లోకేష్ ట్వీట్ చేశారు.