తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు

supreme court

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ప్రాచీన కట్టడాల చట్టంను సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్టుపాశం యాదగిరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  పిటిషనర్ తరపు న్యాయవాది పి. నిరూప్ రెడ్డి ప్రాచీన కట్టడాల చట్టంపై వాదనలు వినిపించారు. వారి వాదనలు విన్న న్యాయస్థానం కట్టడాలపై వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.