సొంత చెల్లిపై అన్న..

girl rape

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘోరం జరిగింది. సొంత చెల్లిని తన స్నేహితుడితో కలిసి రేప్ చేసాడు  అన్న. వమానం భరించలేక మనస్థాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జ్యోతి నగర్ కు చెందిన భూమిక అనే యువతికి  ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. అయితే ఆమె తల్లిదండ్రులు ఓ కార్యక్రమానికి వెళ్తూ ఆమెను సోదరుడి ఇంట్లో వదిలి వెళ్లారు. అదే అదునుగా చూసుకొని ఇంట్లో ఉన్న అన్న సొంత చెల్లెలు అని కూడా చూడకుండా  రేప్ చేశాడు. అంతే కాదు తన స్నేహితుడితో కూడా అత్యాచారం చేయించాడు. దీంతో మనస్థాపం చెందిన యువతి పురుగులమందు తాగింది. గుర్తించిన బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.