నిర్భయ కేసు: వినయ్‌ శర్మ పిటిషన్‌ కొట్టివేత

vinay sharma

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్‌ చేస్తూ దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కొట్టేయడంతో వినయ్ సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేశాడు. జస్టిస్ భానుమతి, జస్టిస్ అశోక్‌భూషణ, జస్టిస్ బోపన్నతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే ఆయన మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మెడికల్‌ రికార్డుల ప్రకారం వినయ్‌ ఆరోగ్య స్థితికి ఇబ్బందేం లేదని కేంద్రం తరపు లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కేంద్రం వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వినయ్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆయన మెడికల్ రిపోర్టులను బట్టి అతడు ఆరోగ్యంగానే ఉన్నాడని ధర్మాసనం తేల్చింది.