ఆర్సీబీ కొత్త లోగో...

RCB New Logo

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కొత్త సీజన్ ఆరంభానికి ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉన్న తరుణంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు శుక్రవారం కొత్త లోగోని విడుదల చేసింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌కు ఆ జట్టు కొత్త లోగోతో బరిలోకి దిగనుంది. ‘‘గత కొన్ని రోజులుగా మీరు ఎదురుచూస్తున్న క్షణం ఇదే. కొత్త ఏడాది, కొత్త దశాబ్దం, కొత్త లోగో..’’ అంటూ లోగో ఉన్న వీడియో పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ఆర్‌సీబీ ఛైర్మన్‌ సంజీవ్‌ చురివాలా మాట్లాడుతూ.. ‘‘ఆర్‌సీబీకి అండగా నిలుస్తున్న అభిమానులకు వినోదాన్ని పంచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపేలా లోగోలోని అంశాలను మార్చాం’’ అని పేర్కొన్నారు.