70వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు..

amaravati

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు 70వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 70వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు అండగాల నిలవాలని ఐఏఎల్‌(ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌) మహాసభ తీర్మానించింది. ఐదు చట్టాల్లో చేయాల్సిన సవరణలతోపాటు రాజధాని రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని తీర్మానించింది.