ట్రంప్ కు కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్

kcr

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ రోజు రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన  విందులో ట్రంప్ పాల్గొంటారు. అయితే ఈ విందుకు తెలంగాణ సీఎం కెసిఆర్ కు కూడా ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ కు కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేశారు. పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్‌ మెమెంటోను కేసీఆర్ అందించనున్నారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పోచంపల్లి, గద్వాల్‌ చీరలను.. మెలానియా, ఇవాంకకు బహూకరించేందుకు కేసీఆర్ స్పెషల్‌గా తయారు చేయించారు.