ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు..

kishan reddy

కేసీఆర్‌ ప్రభుత్వ అండతో ఎంఐఎం నేతలు రెచ్చిపోతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. లక్షమంది ఒవైసీలు అడ్డొచ్చినా సీఏఏను అమలు చేసి తీరతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. ఎంపీ అసదుద్దీన్‌ బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని  కిషన్‌రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయడం సిగ్గుచేటన్నారు. కుటుంబ పార్టీల పాలనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని కిషన్‌రెడ్డి అన్నారు.