ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌ రద్దు

krishna kishore

ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్‌ను క్యాట్ రద్దు చేసింది. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతినిస్తూ ట్రిబ్యునల్‌ అనుమతించింది. కృష్ణ కిశోరె పై ఉన్న కేసులను ప్రభుత్వం చట్ట ప్రకారం పరిశీలించుకోవచ్చని క్యాట్ స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయంటూ వైసీపీ సర్కార్ వేటు వేసింది. అయితే తాజాగా కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది.