బాలికల హాస్టల్‌లో యువకుడు రాత్రంతా...

boy entered into girls hostel

ఇటీవల ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలోని లేడీస్ హాస్టల్‌లోకి ఓ అబ్బాయి దూరి రాతంత్రా గడిపిన ఘటన సంచలనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే ఇటువంటి ఘటన తెలంగాణాలో జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్ మండలంలోని ఓ ప్రభుత్వ బాలికల హాస్టల్‌లోకి వచ్చిన ఓ యువకుడు రాత్రంతా స్నేహితురాలితో గదిలో గడిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఈ నెల 17న వసతి గృహంలోకి ఓ యువకుడు చొరబడ్డాడు. స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపాడు. ఇందుకు మరో ముగ్గురు బాలికలు సహకరించినట్లు తెలుస్తోంది. కాగా విషయం తెలిసినప్పటికీ గోప్యంగా ఉంచిన అధికారులు బాలికలను వసతి గృహం నుంచి తొలగించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.