జగన్ రివర్స్ టెండరింగ్ కు పరాకాష్ఠ : నారా లోకేశ్

lokesh

గతంలో పేదవాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన భూములు లాక్కొని తిరిగి పేదలకు పంచుతామనడం జగన్ రివర్స్ టెండరింగ్‌కు పరాకాష్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఏపీ సర్కార్‌ చేపట్టిన పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమంపై లోకేష్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. పథకాల పేరు మార్పు కోసం.. పేదలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎందుకు లాక్కుంటున్నారని ప్రశ్నించారు. "వేల ఎకరాలతో అక్రమంగా సంపాదించిన మీ ఎస్టేట్లు, ప్యాలెస్ లు ప్రభుత్వానికి ఇవ్వండి.. లక్షల మంది పేదలకు ఇళ్లు వస్తాయి" అంటూ ట్వీట్ చేసారు.