వరల్డ్‌ బ్యాంకు ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ

CM Jagan meets World Bank representatives

ఏపీ సీఎం జగన్‌తో వరల్డ్‌ బ్యాంకు దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ షెర్‌బర్న్‌బెంజ్ ఇతర అధికారులు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతినిధులకు చెప్పారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసలు తెలిపింది. మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ధి ఫలితాలు వస్తాయని ప్రపంచబ్యాంకు బృందం అభిప్రాయం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమని ప్రపంచబ్యాంకు బృందం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతామని బృంద సభ్యలు వెల్లడించారు.