ఏపీ, తెలంగాణ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల చర్చలు వాయిదా

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. బస్సులు నడిపేందుకు అధికారులు సిద్ధమవ్వగా టీఎస్‌ ఆర్టీసీలోని ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు జరిపారు. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదు. 

కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపోయింది

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ... కరోనా అంటే వైసీపీ ప్రభుత్వానికి పిల్లాటలు అయిపోయింది. జగన్ గారు పారాసెటమాల్ మాటలు చెప్పినట్టే యంత్రాంగం కరోనా టెస్టులను ఆషామాషీగా చేస్తుందా అన్న అనుమానం వస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారికి కరోనా టెస్టు చేసి పాజిటివ్ వచ్చిందని, క్వారంటైన్ కు రమ్మని హడావిడి చేసారు. తీరా దీపక్ రెడ్డిగారు హైదరాబాద్ లో రెండుసార్లు RT PCR పరీక్ష చేసుకుంటే రెండు చోట్లా నెగటివ్ అని వచ్చింది.

వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు

హైద్రాబాదులోని పార్క్ హయత్ హోటల్లో మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి రహస్య భేటీపై, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై, వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేస్తున్నారు. 
ఈ సందర్బంగా ట్విట్టర్ లో స్పందిస్తూ...... "ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజీలేని పోరు జరుపుతానని ఎగిరెగిరి పడుతుంటే నిజమే అనుకున్నారంతా. కమ్మని విందులతో పార్క్ హయత్ సాక్షిగా ఇలా దొరికిపోతాడని ఊహించలేదు. జీవితంలో ముఖాముఖి తలపడే యుద్ధానికి సాహసించడు. వెన్నుపోట్ల తోనే ఏదైనా చేయొచ్చనుకుంటాడు". అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు.

24 గంటల్లో 16,992 కరోనా కొత్త కేసులు, 418 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి విజ్రంభన కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,992 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో 418 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదయిన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,73,105 కు చేరాయి. 
వీరిలో 1,86,514 మంది కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, 2,71,696 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యముతో డిశ్చార్జ్ అయ్యారు. అలాగే కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,894 కు చేరాయి.

ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం 

ఏపీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలు కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయినా కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడిది ఆలయాలను తాకింది. విజయవాడలోని ప్రసిద్ధి పొందిన ఇంద్రకీలాద్రి ఆలయంలోని అర్చకుడు కరోనా భారిన పడ్డాడు. దుర్గమ్మ గుడిలో లక్ష కుంకుమార్చనలో విధులు నిర్వహిస్తున్న అర్చకునికి కరోనా సోకింది. దుర్గ గుడిలోని ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయగా, అర్చకుడుకి కరోనా పాసిటివ్ అని తేలింది. దీంతో అర్చకుడుని పన్నమనేని ఆస్పత్రికి తరలించారు.

భారత్-చైనా సరిహద్దులో కూలిన వంతెన

ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలోని మున్సియారి ప్రాంతంలోని ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న బెయిలీ వంతెన కూలిపోయింది. భారీ క్రేన్ ను మోసుకెళ్తున్న ఓ భారీ వాహనం ఈ వంతెనపై వెళుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తో సహా క్రేన్ ఆపరేటర్ గాయపడ్డారు. వీరిని సమీపంలోని మున్సియారి ఆస్పత్రికి తరలించారు. 40 అడుగుల పొడవైన ఈ వంతెనను 2009లో నిర్మించారు. అధిక బరువుతో కూడిన ట్రక్కు కారణంగానే కూలిపోయినట్లు అధికారులు నిర్థారించారు. వంతెన సామర్థ్యం 18 టన్నులు కాగా, క్రేన్‌, లారీ కలిపి 26 టన్నులు ఉన్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి గురైన వలస కార్మికుల బస్సు ... ఒకరు మృతి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంజాదీ ప్రాంతానికి సమీపంలో ఎన్‌హెచ్‌-16 లో 40 మంది ప్రయాణికులతో పుదుచ్చేరి నుండి వస్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయని సిములియా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌ఛార్జి పర్సురాం సాహు తెలిపారు. ఘటన స్థలానికి పోలీసు సిబ్బంది చేరుకున్నారని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి పంపించారని ఆయన చెప్పారు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురిని బాలసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

మద్యం మత్తులో యువతి రోడ్డుపై హల్ చల్...

కోల్‌కతాలోని పద్మపుకూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఒక యువతి రోడ్డుపై హల్ చల్ చేసింది. కోల్‌కతాలో బిజీగా వుండే రెడ్ రోడ్ ప్రాంతంలో యువతి ఒంటి పైభాగంలో బట్టలు లేకుండ రోడ్డుపై తిరుగుతూ కన్పించింది. ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని యువతిని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఏపీలో పదివేలు దాటిన కరోనా కేసులు 

ఏపీలో కరోనా మహమ్మారి విజ్రంభన కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 448 మంది కాగా, పొరుగు రాష్ట్రాల వారు 37 మంది వున్నారు. అలాగే ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 12 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య పదివేలుకు చేరాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే పదిమంది మరణించారు.

మేం కలిస్తే తప్పేంటి? : సుజనా చౌదరి 

హైద్రాబాదులోని పార్క్ హయత్ హోటల్లో ఈ నెల 13 న రహస్య భేటీ అయినా మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల రహస్య భేటీపై స్పందిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. విజయసాయి రెడ్డి విమర్శలపై బీజేపీ నేత సుజనా చౌదరి ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.