కరోనా ఎఫెక్ట్ : పద్మశ్రీ గ్రహీత నిర్మల్ సింగ్ మృతి

కరోనా సోకి పద్మశ్రీ అవార్డు గ్రహీత, స్వర్ణ దేవాలయ మాజా హజారీ రాగి నిర్మల్ సింగ్ ఖల్సా గురువారం ఉదయం మరణించారు. కరోనాకి చికిత్స పొందుతూ.. ఈ తెల్లవారుజామున 4:30 గంటలకు ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన సింగ్.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో మార్చి 30న గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేరారు. 62 ఏళ్ల ఖల్సా 2009లో పద్మశ్రీ పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 

తెలంగాణలో 127కు చేరిన కరోనా కేసులు...

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 127కు చేరుకుంది. బుధవారం (ఏప్రిల్ 1) ఒక్క రోజే రాష్ట్రంలో 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో బుధవారం మరో ముగ్గురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యరోగ్యశాఖ తాజాగా సమాచారం వెల్లడించింది. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. 

ఏకాంతంగానే భద్రాద్రి రాముని కళ్యాణం..

దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. అయితే, శ్రీరాముడు నడయాడిన నేలగా ప్రసిద్ధికెక్కిన భద్రాచలంలో ఈ నవమి సందడి కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించటంతో  భక్తులు లేక భద్రాచలం బోసిపోయింది. దేవస్థానం చరిత్రలో తొలిసారి రామయ్య కళ్యాణాన్ని ఆలయంలోని నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహించనున్నారు. రామాలయం నిర్మాణం చేపట్టిన మూడున్నర శతాబ్దాలలో భక్తుల భాగస్వామ్యం లేకుండా ఏనాడు ఈ విధంగా కళ్యాణం జరగలేదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

కరోనా బాధితుల్ని చిన్న చూపు చూడొద్దు: సీఎం జగన్‌

కరోనా వస్తే తప్పుజరిగినట్లు భావించకూడదని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. ఏపీలో నమోదైన 87 కేసుల్లో 70 కేసులు ఢిల్లీ నుంచి వచ్చినవారికే పాజిటివ్‌ వచ్చిందని జగన్‌ చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించిందని ఏపీ సీఎం జగన్ తెలిపారు. అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుకోని భారం పడిందని సీఎం జగన్‌ అన్నారు. జీతాలు వాయిదా వేసేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

కరోనా అనేది జ్వరం లాంటిదే.. ఎవరూ భయపడొద్దు: సీఎం జగన్

రెండురోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగడం బాధాకరమని ఏపీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో నెలకొన్న పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో సదస్సులో పాల్గొన్నవారికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. సదస్సుకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్‌ జ్వరం, ఫ్లూ లాంటిదే, ఎవరూ భయపడొద్దన్నారు. వృద్ధులు, డయాబెటిస్‌, ఇతర సమస్యలున్నవారికి తీవ్రంగా ఉంటుందన్నారు. ఈ వైరస్‌ సోకడం పాపంగానో, తప్పుగానో చూడొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కరోనా ఒకరి నుంచి మరొకరికి సులువుగా సోకుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 87 కేసులు రాష్ట్రంలో నమోదైతే..

అన్ని రాష్ట్రాల సీఎంల‌తో రేపు ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌

కరోనా మహమ్మారి బాధితుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ వైరస్‌  వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ సమన్వయంతో ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో న‌మోదైన క‌రోనా కేసులు, సంభ‌వించిన మ‌ర‌ణాలు, క‌రోనా నివార‌ణ‌కు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు మొద‌లైన వాటిపై ఈ భేటీలో చ‌ర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ స‌మావేశంలో పాల్గొన్న వారు ఏయే రాష్ట్రంలో ఎంత‌మంది ఉన్నారు?

కరోనా పై పోరాటంలో ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల ఆర్థిక సాయం...

కరోనా మహమ్మారిపై పోరాటంలో ఒకవేళ ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ రోజు ఆయన మీడియాతో  మాట్లాడుతూ.. వారు ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగం అనే దాంతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందదజేస్తాం అని కేజ్రీవాల్‌ వెల్లడించారు. వాస్తవానికి ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వారికి ప్రభుత్వం ప్రయోజనాలు కల్పిస్తూ ఉంటుంది. కానీ కరోనా విపత్తు నేపథ్యంలో ప్రభుత్వాలు నిబంధనలను సడలిస్తోంది. అందరికీ సమన్యాయం చేస్తామని వెల్లడించారు. మరోవైపు దిల్లీలో మొత్తం 120 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే చేరింది..!

కరోనా మహమ్మారి రోజురోజూకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలు దాని కట్టడికి ఎంతగానో శ్రమిస్తున్నాయి. కరోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టే ప్ర‌య‌త్నంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ‌ప్రాతిప‌దికన చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ప్రభుత్వాలతో పాటు పలువురు కవులు, కళాకారులు సైతం భాగస్వాములవుతున్నారు. తమదైన శైలిలో పాటలు పాడుతూ ప్రజల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పలువురు కళాకారులు/ గాయకులు తమదైన ప్రతిభతో ప్రజల్లో కరోనా నివారణ చర్యలపై చైతన్యం పెంచగా.. తాజాగా టాలీవుడ్‌ దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి ‘వి విల్‌ స్టే ఎట్‌ హోమ్‌..

విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ భారీ విరాళం..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరు కోసం  విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ భారీ విరాళాన్ని ప్రకటించారు. విప్రో లిమిటెడ్, విప్రో ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ మరియు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్లతో కలిసి కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడం కోసం రూ. 1,125 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మొత్తం విరాళంలో  విప్రో రూ.100కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ.25కోట్లు, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ తరఫున 1000 కోట్లను తమవంతు సాయంగా  కేటాయించినట్లు సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.  

రేషన్ సరుకుల కోసం ఘర్షణ...

రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు పౌరసరఫరాల కేంద్రాల వద్ద ఘర్షణకు దిగుతున్నారు. తాము ముందు వచ్చామంటే.. తాము ముందు వచ్చామంటూ లబ్ధిదారులు తోపులాటకు దిగుతున్నారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. విశాఖ ఎంవివి కాలని డిపో నెంబర్ 216 వద్ద సంఘటన చోటుచేసుకుంది. వాలంటీర్లు కలగజేసుకుని అందరికీ టోకెన్లు జారీ చేసిన వాలంటీర్లు నంబర్ల వారీగా డిపోల వద్దకి రావాలని చెప్పారు.