Andhrapradesh

చంద్రబాబు కీలక అడుగు

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:46

భాజపాయేతర శక్తుల్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రధాన అజెండాగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన మరో కీలక నేతతో భేటి కానున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ఈ నెల 19న కోల్‌కతా వెళ్లి పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతారు.

రామచంద్రాపురం నియోజకవర్గంలో జనసేన ప్రజాపోరాటయాత్ర

Submitted by ganesh on Tue, 11/13/2018 - 19:43

                     తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాపోరాటయాత్ర కొనసాగుతోంది. రామచంద్రాపురంలో పవన్ బహిరంగసభ నిర్వహించారు.  వెనకబడిన వర్గాలకు అండగా ఉంటానని పవన్ అన్నారు. తాను ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని.. మార్పు కోసమే పార్టీ పెట్టానన్నారు. కులాల పేరుతో దూషిస్తున్న టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కన్నీళ్లు పెట్టని రైతాంధ్రప్రదేశ్ కు జనసేన కట్టుబడి ఉందన్నారు.

ఆశావర్కర్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన సీఎం

Submitted by ganesh on Tue, 11/13/2018 - 17:10

                      ఆశాకార్యకర్తల ఆత్మీయ సమేవశానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశావర్కర్లకు జీతాలు పెంచామని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి సంక్షమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ఆశావర్కర్ల పాత్ర అభినందనీమయ్యారు. పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని సీఎం అన్నారు.

టీడీపీ వ్యూహకమిటీతో సీఎం చంద్రబాబు సమావేశం

Submitted by ganesh on Tue, 11/13/2018 - 16:23

                    తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటి ప్రతినిధులతో  పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, 2019 ఎన్నికల వ్యూహాలపై ఆయన సమీక్ష జరిపారు. గ్రామ వికాసం, సభ్యత్వ నమోదు, బూత్ కన్వీనర్ల శిక్షణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 6వేల 404 గ్రామాల్లో గ్రామ వికాసం కార్యక్రమం జరిగిందని..మిగిలిన 10వేల గ్రామాల్లో కూడా ఉత్సాహంగా గ్రామవికాసం కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యేలపై ప్రజామోదాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానన్న ఆయన...

చంద్రబాబుకి నోటీసులు...

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 16:09

విశాఖ విమానాశ్రయంలో గత నెలలలో విపక్ష నేత జగన్ పై జరిగిన దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. విచారణలో శ్రీనివాస్ చెప్తున్న సమాధానాలకు పోలీసులు సంతృప్తి చెందడం లేదు. ఇక ఇదిలా ఉంటె ఈ కేసు విచారణకు సంబంధించి జగన్ హైకోర్ట్ లో పిటీషన్ వేసిన సంగతి అందరికి తెల్సిందే. తాజాగా కేసు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 8 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీఐఎస్ఎఫ్ అధికారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్ ని ఆదేశించిన కోర్ట్.. విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని సిట్‌ కు కోర్ట్ సూచించింది.

వైసీపీలో చేరిన మాజీ మంత్రి సీ.రామచంద్రయ్య

Submitted by ganesh on Tue, 11/13/2018 - 15:54

                     మాజీ మంత్రి సీ.రామచంద్రయ్య వైసీపీలో చేరారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరతారని రామచంద్రయ్య అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, గవర్నర్ వ్యవస్థని చంద్రబాబు భ్రష్టుపట్టుంచారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కాళ్లు పట్టుకొని దేశంలో చక్రం తుప్పాలని చంద్రబాబు కలలగంటున్నారని రామచంద్రయ్య ఎద్దేవా చేశారు.

పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో 5 కోట్లు అవినీతి జరిగింది : అబంటి

Submitted by ganesh on Tue, 11/13/2018 - 15:44

                      పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా వైసీపీ పోరాడుతుందని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అరోపించారు. దీనిపై వైసీపీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపడితే... పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని మండిపడ్డారు. పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే, తన అనుచరులతో కలిసి 5కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని అంబటి ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తున్న తమను దుర్మార్గంగా అడ్డుకుంటున్నారని, ఎన్ని విధాలుగా అడ్డుకున్నా...

బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో బిజీబిజీగా చంద్రబాబు

Submitted by ganesh on Tue, 11/13/2018 - 13:25

                    సేవ్ నేషన్ టూర్ లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 19న కోల్ కతా వెళ్లనున్నారు. బీజేపీ యేతర కూటమే ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు జాతీయ పార్టీల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు.

రెండో దఫా ఫ్లాట్ల బుకింగ్ వాయిదా..?

Submitted by ganesh on Tue, 11/13/2018 - 12:53

                   ఏపీ సీఆర్డీయే రాజధానిలో నిర్మించనున్న ప్రజానివాస సముదాయం  హ్యాపీనెస్ట్, రెండో దఫా ఫ్లాట్ల బుకింగ్ వాయిదా పడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. సీఆర్డీయే అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న బుకింగ్ జరిగాల్సి ఉంది. కానీ బుకింగ్ ను వాయిదా పడినట్లు తెలుస్తోంది.

చేతి వృత్తిదారులు హర్షం వ్యక్తం

Submitted by ganesh on Tue, 11/13/2018 - 12:18

                       రాష్ట్రంలో కనుమరుగవుతున్న చేతివృత్తులకు జీవం పోసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చేతి వృత్తిదారులకు అధునాతన పనిముట్లను అందించడం ద్వారా శారీరక శ్రమ తగ్గించాలని, వారి ఆదాయాన్ని పెంచాలని నిర్ణయించింది. ఆదరణ-2 పథకం అమలులో భాగంగా 345 రకాల చేతి పనిముట్లను సీఎం లబ్ధిదారులకు అందచేశారు.