Telangana

వివరణ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Submitted by venkateshgullapally on Mon, 11/19/2018 - 19:08

తెలంగాణాలో ఎన్నికల్లో నామినేషన్ పర్వాలు ముగిసాయి. ఇక ఈ ఎన్నికల్లో పోటి చేస్తుందని భావించిన జనసేన పార్టీ తాజాగా వివరణ ఇచ్చింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఒక వివరణ ఇచ్చారు. ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఉంటే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై జనసేనకు ఒక ప్రణాళిక ఉందన్నారు. అయితే, ఎన్నికలు ముందుగానే రావడంతో కొత్తగా ఆవిర్భవించిన తమ పార్టీకి బరిలో నిలవడం ఒకింత కష్టతరమని భావించి పోటీ విరమించుకున్నట్లు ఆయన తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్‌ ప్రకారం జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు.

పదికి పది సీట్లు గెలుస్తారా..?

Submitted by ganesh on Mon, 11/19/2018 - 18:08

                         వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో  పదికి పది సీట్లు గెలిచి తీరుతామని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ తో పాటు మంత్రి తుమ్మల, ఇతర నేతలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాకు ప్రాణాధారమైన సీతారామ ప్రాజెక్టును ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తిచేసి తీరుతామన్నారు.

ఉప్పేరు గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం...

Submitted by ganesh on Mon, 11/19/2018 - 17:47

                      కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణ తరపున ఆమె కూతురు డీకే snigdha రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం ఉప్పేరు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు.

నారాయణపేటలో డీకే అరుణ అనుచరుల ఆందోళన

Submitted by ganesh on Mon, 11/19/2018 - 17:11

                     ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి డీకే అరుణ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మధ్య విభేదాలు, కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి. నారాయణ పేట నుంచి శివకుమార్ కు టికెట్ ఇప్పించేందుకు డీకే అరుణ తీవ్రంగా ప్రయత్నించగా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. నారాయణ పేట నుంచి వామనగారి కృష్ణ కు జైపాల్ రెడ్డి టికెట్ ఇప్పించారు. దీంతో నారాయణ పేటలో డీకే అరుణ అనుచరులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి..

సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి నామినేషన్లు దాఖలు

Submitted by ganesh on Mon, 11/19/2018 - 17:00

                         రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అసెంబ్లీ స్థానానికి  అన్ని పార్టీ ల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ ఎలాంటి ఆర్భాటం లేకుండా కార్యకర్తలతో ఆర్డీవో కార్యాలయానికి తరలిచ్చి రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ప్రజా కూటమి అభ్యర్థి కేకే మహేంధర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా,  బీజేపీ తరఫున మల్లుగారి నరసాగౌడ్ నామినేషన్ వేశారు.

కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ

Submitted by ganesh on Mon, 11/19/2018 - 16:20

                      భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ కు మూకుమ్మడి రాజీనామా చేశారు.

నామినేషన్లు వేసింది వీళ్ళే..

Submitted by venkateshgullapally on Mon, 11/19/2018 - 16:14

తెలంగాణాలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. అభ్యర్థిత్వాలు ఖరారు అయినప్పటికీ సోమవారం ఏకాదశి కావడంతో ఎక్కువ మంది ఆఖరి రోజు నామినేషన్‌ దాఖలు చేసారు.  

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక మున్సిపల్ ఛైర్మన్‌ పావనితో కలిసి వచ్చి రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్‌కు నామపత్రాలను అందజేశారు. అదే సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే మహేందర్‌ రెడ్డి కూడా నామినేషన్ వేసారు.

తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఈటల రాజేందర్‌  హుజూరాబాద్‌ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ వేశారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నిడమానూరులో నామినేషన్‌ వేశారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులు మరోమారు నామినేషన్ పత్రాలు దాఖలు

Submitted by ganesh on Mon, 11/19/2018 - 15:59

                     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పలువురు అభ్యర్థులు మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు చివరిరోజు కావడంతో స్వతంత్ర అభ్యర్థులతో పాటు పలువురు ప్రధాన పార్టీల అభ్యర్థులు మరోమారు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ప్రజాకూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు తరఫున ఆయన మనవరాలు అలేఖ్య నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ నుంచి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేశారు.

పెద్ద సారు బరిలోకి వస్తాడా..?

Submitted by ganesh on Mon, 11/19/2018 - 13:10

                      టీఆర్ఎస్ పార్టీ ప్ర‌చార జోరు పెంచనుంది. గులాబీ బాస్ కేసీఆర్  ప్ర‌చార షెడ్యూల్  విడుద‌ల అవడంతో కారు వేగం పెరగ‌నుంది. ఇంతకాలం మహాకూటమి సీట్లు ఫైనల్ కాలేదని ప్రచారానికి విరామం ఇచ్చిన కేసీఆర్... నియోజ‌క‌వ‌ర్గాల వ‌రుస ప‌ర్య‌ట‌న‌లతో కారు పార్టీ స్పీడ్ పెంచారు. క్షేత్ర స్థాయి ప్ర‌చారంలో కారు పార్టీ  దూసుకుపోనుంది.... పెద్ద సారు బరిలో దిగితే.... అంతా త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని భావిస్తున్నారు గులాబి పార్టీ అభ్య‌ర్ధులు.