National

రోహిత్ శర్మతో తలనొప్పి..

Submitted by venkateshgullapally on Mon, 11/19/2018 - 18:32

పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ ఒక మొనగాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఏ జట్టు అయినా సరే క్రీజ్ లో కుదురుకుంటే మాత్రం అతని ఆటతో చుక్కలు చూపిస్తాడు. ఆ బౌలర్ ఈ బౌలర్ అనే తేడా లేకుండా రోహిత్ ఆడే ఇన్నింగ్స్ లు ప్రత్యర్ధులకు భయాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం రోహిత్ భీకర ఫాం లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో ఆసిస్ పర్యటనలో అతను ఏ మేరకు రాణిస్తాడు అనేది ఆసక్తిగా మారింది. తాజాగా రోహిత్ గురించి ఆసిస్ పేసర్‌ నేథన్‌ కౌల్టర్‌నైల్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసాడు. అతడో నమ్మశక్యం కాని ఆటగాడని... రికార్డులే అతడి గురించి చెప్తాయన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మంచి గణాంకాలు నమోదు చేశాడని కొనియాడుతూ....

బీజేపీ యేతర కూటమి ఏర్పాటులో బిజీబిజీగా చంద్రబాబు

Submitted by ganesh on Mon, 11/19/2018 - 13:04

                       సేవ్ నేషన్ టూర్ లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కోల్ కతా వెళ్లనున్నారు. బీజేపీయేతర కూటమే ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పలు జాతీయ పార్టీల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు తాజాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో  ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు పై చర్చించనున్నారు.

బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు నడుం బిగించిన బాబు

Submitted by ganesh on Mon, 11/19/2018 - 10:13

                      బీజేపీ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నడుం బిగించారు. ఇప్పటికే కర్ణాటక, ఢిల్లీ ముఖ్యమంత్రులు కుమార స్వామి, అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్ తో బాబు భేటీ అయ్యారు. కూటమి ఏర్పాటులో భాగంగా నేడు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ కానున్నారు. ఉదయం పది గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో కోల్ కతా బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకు మమతతో బాబు భేటీ అవుతారు.

ముంబై వచ్చిన దీపికా-రణ్ వీర్

Submitted by ganesh on Sun, 11/18/2018 - 14:46

                  ఇటలీలో తమ వివాహాన్ని వైభవంగా జరుపుకున్న బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ లు ఈ ఉదయం ముంబై తిరిగి వచ్చారు. సంప్రదాయ దుస్తులు వచ్చిన జంటను చూసేందుకు ప్రయాణికులు, అభిమానులు  పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఎయిర్ పోర్టు అధికారులు ఈ జంటతో సెల్ఫీలు దిగాలని కోరగా..వారు అంగీకరించి కాసేపు సెల్ఫీలు దిగారు..నేరుగా నివాసానికి వెళ్లిన రణ్ వీర్, దీపికా జంటకు సంప్రదాయ రీతిలో బంధుమిత్రులు స్వాగతం పలికారు..

ఢిల్లీపై దండయాత్రకు సిద్ధమా..?

Submitted by ganesh on Sun, 11/18/2018 - 11:32

                    ఢిల్లీపై దండయాత్రకు బీజేపీయేతర పక్షాలు ఏకమవుతున్నాయి. 22న ఢిల్లీలో బీజేపీయేతర పక్షాల కూటమి సమావేశంకానుంది. కూటమి నేతల సమావేశంపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. రేపు కోల్‌కత్తా వెళ్లి మమతా బెనర్జీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

ఏపీ ప్రభుత్వం పై అరుణ్ జైట్లీ ఆరోపణలు

Submitted by Likhitha on Sat, 11/17/2018 - 14:06

                  ఏపీ ప్రభుత్వం సీబీఐకి నో ఎంట్రీ విధించడంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సంచలన ఆరోపణలు చేశారు. తీవ్రమైన తప్పులు చేసినవారే సీబీఐకి భయపడి సమ్మతి ఉత్తర్వులను రద్దు చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. శాంతిభద్రతల విషయం రాష్ట్రాల పరిధిలోనే ఉన్నప్పటికీ అవినీతి విషయంలో ఏ రాష్ట్రానికీ సార్వభౌమాధికారం లేదని జైట్లీ స్పష్టం చేశారు. భవిష్యత్లో ఏదో జరుగుతుందన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దు చేసిందన్నారు.

అల్లకల్లోలం చేసిన గజ తుఫాన్

Submitted by Likhitha on Sat, 11/17/2018 - 09:42

                   నైరుతీ బంగాళఖాతంలో దూసుకొచ్చిన గజ తుఫాన్ తీర ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది. శుక్రవారం ఉదయం కడలూరు-పంబన్ మధ్య తీరం దాటింది. దీంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, తీర ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిశాయి. 

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Submitted by ganesh on Fri, 11/16/2018 - 20:58

                    సీబీఐ విచారణ విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో సీబీఐ ఎలాంటి విచారణ జరపాలన్నా  ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ నోటిఫికేషన్ జారీ చేసింది...గతంలో ఇచ్చిన జనరల్ కంసెంట్ ను వెనక్కి తీసుకింది. సీబీఐలో నెలకొన్న పరిస్థితులతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతుంది.ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విచారణకూ ఏసీబీ ని ఉపయోగిస్తామని సర్కార్ చెబుతుంది...

ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ...

Submitted by ganesh on Fri, 11/16/2018 - 16:20

                      కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఇకపై  రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆ సంస్థ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే  సమ్మతి ఉత్తర్వును ఉపసంహరించడం ద్వారా సీబీఐకి రాష్ర్ట ప్రభుత్వం చెక్ పెట్టింది.

తమిళనాడులో తుఫాను బీభత్సం

Submitted by Likhitha on Fri, 11/16/2018 - 11:54

                  గజ తుఫాను తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటివరకు సైక్లోన్ ధాటికి ఆరుగురు మృతిచెందారు. కడలూరుకు చెందిన ఇద్దరితో పాటు... తంజావూరు వాసులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కడలూరు, నాగపట్నం, తొండి, పంబన్‌లో వేకువజాము నుంచి తుపాను ప్రభావం చూపించింది.