sports

క్రికెట్ లీగ్ పోటీలు...

Submitted by ganesh on Mon, 11/19/2018 - 17:23

                     విశాఖజిల్లాలో డిసెంబర్ 1 నుంచి నెల రోజుల పాటు MVV T10 పేరుతో క్రికెట్ లీగ్ పోటీలు జరగనున్నాయి.  యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించడమే లక్ష్యం గా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని  YCP విశాఖ పార్లమెంట్ సమన్యయ కర్త MVV

ధోనికి మద్దతుగా మాజీ..

Submitted by venkateshgullapally on Mon, 11/19/2018 - 13:47

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గత కొంత కాలంగా ఫాం లేక నానా అవస్థలు పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. జట్టులో యువ ఆటగాళ్ళు దూసుకు వస్తున్న ఈ తరుణంలో అతనిపై కూడా క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. మాజీ ఆటగాళ్ళు ఇక ధోని తప్పుకుటే బెస్ట్ అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ తరుణంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ధోనికి అండగా నిలిచాడు. "మహేంద్రసింగ్‌ ధోనీ గురించి అందరూ ఏం ఆశిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆయన 20 లేదా 25 ఏళ్ల కుర్రోడు కాదు కదా!.

ముగిసిన జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్

Submitted by ganesh on Mon, 11/19/2018 - 12:51

                    నిత్యం వార్తల సేకరణలో ఎంతో కష్టపడే జర్నలిస్టుల వికాశం కోసం.. కృష్ణ జిల్లా మూలపాడు క్రికెట్ స్టేడియంలో స్టేట్ లెవెల్ అక్రిడేటెడ్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ లీగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ లో చిత్తూరుకి చెందిన జట్టు ప్రధమ స్థానంలోనిలిచి కప్ కైవసం చేసుకుంది.

హుషారుగా షికారు..

Submitted by Likhitha on Sat, 11/17/2018 - 08:15

                     టూరిజానికి విజయవాడ కేరాఫ్ గా మారింది. రాష్ట్ర విభజన అనంతరం... ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణంతో పాటు పలు అంతర్జాతీయ ఈవెంట్ లకు బెజవాడ సాక్షిగా నిలిచింది. ఆహ్లాదాన్ని పంచే ఎన్నో ఈవెంట్ లు నిర్వహించడంతో బెజవాడ మరోసారి అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది.

బోట్ రేసింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Submitted by Likhitha on Fri, 11/16/2018 - 13:30

                     రాజధాని అమరావతిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఈవెంట్ F1 H2O పవర్ బోట్ రేసింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు ఈ పోటీల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయి. ఈ సందర్భంగా టూరిజం మంత్రి అఖిలప్రియ ఇవాళ కృష్ణాతీరంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఐపియల్ కి ఆసిస్ దూరం

Submitted by venkateshgullapally on Thu, 11/15/2018 - 16:02

అసలు ఐపియల్ అనగానే ఆటగాళ్ళు పాల్గొనడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాసుల వర్షం కురిపించడంతో ఈ లీగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే దేశం కోసం ఆలోచించి ఒక జట్టు ఆటగాళ్ళు ఐపియల్ కి దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్‌-2019కి, ఇంగ్లాండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు మధ్య విరామ సమయం చాలా తక్కువగా ఉండటంతో ఐపీఎల్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ లీగ్ లో పాల్గొనే ఆసీస్‌ క్రికెటర్ల విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీనితో క్రికెటర్లు దేశానికే తొలి ప్రాధాన్యమివ్వాలని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

F1 H2O రేసింగ్ కు సర్వం సిద్ధం

Submitted by Likhitha on Thu, 11/15/2018 - 09:20

                   జల సంబంధిత క్రీడలు అన్నింటికీ ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలని, ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బోట్ రేసింగ్‌తో పాటు ఫ్లయింగ్ బోట్స్, ఆక్వా బైక్స్ వంటి పోటీల ద్వారా దేశవిదేశీ పర్యాటకులను పెద్దఎత్తున ఆకట్టుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

రోహిత్ ని దాటేసిన మహిళా క్రికెటర్..

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:52

భారత మహిళా క్రికెట్ కి గాడ్ గా చెప్పుకునే మిథాలి రాజ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ కి దిగిన మిథాలి 47బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసింది. ఈ సందర్భంగా ఒక సరికొత్త రికార్డ్ ని ఆమె తన ఖాతాలో వేసుకుంది. భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ(2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) నిలిచిన ఆమె టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డ్ ని కూడా బద్దలుకొట్టింది. ఇప్పటి వరకు భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ(2,207 పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) నిలిచాడు.

వాళ్ళు లేకపోవడం వాళ్లకు ఇబ్బందే..

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 16:24

బాల్ ట్యాంపరింగ్ లో దొరికి ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసిస్ కీలక ఆటగాళ్ళు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేకపోవడం ఆ జట్టు కి దెబ్బే అంటున్నాడు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ శమి.. ఈ నెల 21 నుంచి ఆ జట్టుతో మూడు మ్యాచుల టి20 సీరీస్ ఆడుతున్న నేపధ్యంలో మాట్లాడిన శమి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసాడు. "స్మిత్‌, వార్నర్ లేకపోవడం వల్ల ఆసీస్‌ జట్టు కచ్చితంగా బలహీనపడుతుంది.

యువరాజ్ అందుకే కోపంగా ఉన్నాడా..?

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 16:18

టీం ఇండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలివుడ్ నటుడు అంగద్ బేడి చిన్న నాటి స్నేహితులు. యువరాజ్ ఆడే మ్యాచులు అతను చూడటం అతను నటించే సినిమాలు యువి ఎక్కువ చూడటం గతంలో ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అగాధం ఏర్పడింది. దీనికి కారణం ఏంటి అనేది తెలియకపోయినా బేడి ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. సినీ నటి నేహా ధుపియాను అంగద్‌ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.  పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయ్యేవరకు వీరి పెళ్లి విషయం బయటకు రానివ్వలేదు. ఆ తర్వాత యువరాజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దీనిపై మాట్లాడిన అంగద్.. ‘ఫ్రెండ్‌షిప్‌ డే రోజున యువీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టాడు.