Latest news

వరుస హిట్స్ పడటానికి రీజన్ ఏంటి..?

Submitted by ganesh on Tue, 11/13/2018 - 21:11

                     శర్వానంద్...టాలీవుడ్ లో వరుస హిట్స్ తో సందడి చేస్తున్న హీరో. రిసెంట్ గా మహానుభావుడుతో మ్యాజిక్ చేసిన తాను ఇప్పుడు పడి పడి లేచే మనస్సు అంటూ లవ్ లో ఉన్న సరికొత్త ఫిల్ ని రూచి చూపించబోతున్నాడు.ఇంత వరకు ఓకే...కాని శర్వా ఎకౌంట్ లో  వరుస హిట్స్ పడటానికి రీజన్ ఏంటి?.దాని వెనుకున్న మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య...

Submitted by ganesh on Tue, 11/13/2018 - 20:53

                     టాలీవుడ్ లో ఒక‌టి కాదు, రెండు కాదు..ఏకంగా 13 ఏళ్ళైపోయింది నంద‌మూరి కుటుంబం నుంచి కొత్త హీరో వ‌చ్చి. ఇప్ప‌టికీ అదే క‌ళ్యాణ్ రామ్.. అదే ఎన్టీఆర్.. అదే బాల‌య్య... ఇండ‌స్ట్రీని దున్నేస్తున్నారు. వాళ్లు కాకుండా ఈ కుటుంబం నుంచి కొత్త మొహాలు రాలేదు. దాంతో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని  నంద‌మూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

తెరపైకి తెచ్చి 'మీ..టూ...'

Submitted by ganesh on Tue, 11/13/2018 - 20:11

                    టాలీవుడ్ లో ఒక్కోసారి ఊహించనివి జరుగుతుంటాయి. ఆవేశంలోనో.. ఆనందంలోనే .. ఉద్వేగంలోనో.. ఉల్లాసంలోనో అనుకోని విధంగా అవతలి వారిపై ప్రేమ పుట్టుకొచ్చేస్తుంటుంది. ఆ ప్రేమ కాస్తా చటుక్కున ఛుమ్మాగా మారితేనే  షాకింగ్ సర్ ప్రైజ్ ఆడియెన్ కి దొరుకుతుంది.

రోహిత్ ని దాటేసిన మహిళా క్రికెటర్..

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:52

భారత మహిళా క్రికెట్ కి గాడ్ గా చెప్పుకునే మిథాలి రాజ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ కి దిగిన మిథాలి 47బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసింది. ఈ సందర్భంగా ఒక సరికొత్త రికార్డ్ ని ఆమె తన ఖాతాలో వేసుకుంది. భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ(2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) నిలిచిన ఆమె టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డ్ ని కూడా బద్దలుకొట్టింది. ఇప్పటి వరకు భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్‌ శర్మ(2,207 పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) నిలిచాడు.

అత్త లీడర్ అయింది

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:49

టాలివుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి అందరికి తెలిసిందే, రాజకీయంగాను, సిని పరంగాను పాపులర్ అయిన వ్యక్తుల జీవితాలను చిత్రాల రూపంలో ప్రేక్షకులకు అందిస్తున్నారు దర్శకులు. తాజాగా ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఒక సినిమా తెరకేక్కుతుంటే రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమకు చెందిన ఒక మహిళా నాయకురాలిగా ఆమె నటిస్తుండగా.. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఫోటోని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు, తన పాత్రకు సంబంధించి ఎలాంటి వివరాలు చెప్పకపోయినా ఆమె పోస్ట్ చేసిన ఫోటో పరంగా చూస్తే..

చంద్రబాబు కీలక అడుగు

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:46

భాజపాయేతర శక్తుల్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రధాన అజెండాగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన మరో కీలక నేతతో భేటి కానున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ఈ నెల 19న కోల్‌కతా వెళ్లి పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతారు.

రామచంద్రాపురం నియోజకవర్గంలో జనసేన ప్రజాపోరాటయాత్ర

Submitted by ganesh on Tue, 11/13/2018 - 19:43

                     తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాపోరాటయాత్ర కొనసాగుతోంది. రామచంద్రాపురంలో పవన్ బహిరంగసభ నిర్వహించారు.  వెనకబడిన వర్గాలకు అండగా ఉంటానని పవన్ అన్నారు. తాను ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని.. మార్పు కోసమే పార్టీ పెట్టానన్నారు. కులాల పేరుతో దూషిస్తున్న టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కన్నీళ్లు పెట్టని రైతాంధ్రప్రదేశ్ కు జనసేన కట్టుబడి ఉందన్నారు.

మరోసారి గుజరాత్ అల్లర్ల కేసు

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:42

ప్రధాని నరేంద్ర మోడికి సుప్రీమ్ కోర్ట్ షాక్ ఇచ్చింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న 2002 గుజరాత్ అల్లర్ల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అల్లర్ల కేసులో ప్రధాని మోదీ, మరో 59 మందికి 'సిట్' గతంలో క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని నాటి అల్లర్లలో మృతిచెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఇషాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఆమె వేసిన పిటిషన్‌పై ఈనెల 19న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అహ్మదాబాద్‌లో జరిగిన అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా సుమారు 68 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగూడెంలో టీడీపీ కార్యకర్తల ఆందోళన

Submitted by ganesh on Tue, 11/13/2018 - 19:17

                     మహాకూటమి పోత్తుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టికెట్ తమ నాయకుడు కోనేరు నాగేశ్వరరావుకు  దక్కకుండా ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ... కొత్తగూడెంలో టీడీపీ కార్యకర్తలు నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ నమ్ముకుని ఉన్న కోనేరు కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని. నామ వ్యవహరించిన తీరు ఏకపక్షం గా ఉందని టీడీపీ నేత రాంబాబు మండిపడ్డారు.