Political

చంద్రబాబు కీలక అడుగు

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:46

భాజపాయేతర శక్తుల్ని ఏకతాటిపైకి తేవాలన్న ప్రధాన అజెండాగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన మరో కీలక నేతతో భేటి కానున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు ఈ నెల 19న కోల్‌కతా వెళ్లి పశ్చిమ్‌బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతారు.

రామచంద్రాపురం నియోజకవర్గంలో జనసేన ప్రజాపోరాటయాత్ర

Submitted by ganesh on Tue, 11/13/2018 - 19:43

                     తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజాపోరాటయాత్ర కొనసాగుతోంది. రామచంద్రాపురంలో పవన్ బహిరంగసభ నిర్వహించారు.  వెనకబడిన వర్గాలకు అండగా ఉంటానని పవన్ అన్నారు. తాను ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని.. మార్పు కోసమే పార్టీ పెట్టానన్నారు. కులాల పేరుతో దూషిస్తున్న టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. కన్నీళ్లు పెట్టని రైతాంధ్రప్రదేశ్ కు జనసేన కట్టుబడి ఉందన్నారు.

మరోసారి గుజరాత్ అల్లర్ల కేసు

Submitted by venkateshgullapally on Tue, 11/13/2018 - 19:42

ప్రధాని నరేంద్ర మోడికి సుప్రీమ్ కోర్ట్ షాక్ ఇచ్చింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చోటుచేసుకున్న 2002 గుజరాత్ అల్లర్ల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అల్లర్ల కేసులో ప్రధాని మోదీ, మరో 59 మందికి 'సిట్' గతంలో క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని నాటి అల్లర్లలో మృతిచెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఇషాన్‌ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఆమె వేసిన పిటిషన్‌పై ఈనెల 19న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. అహ్మదాబాద్‌లో జరిగిన అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా సుమారు 68 మంది ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగూడెంలో టీడీపీ కార్యకర్తల ఆందోళన

Submitted by ganesh on Tue, 11/13/2018 - 19:17

                     మహాకూటమి పోత్తుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టికెట్ తమ నాయకుడు కోనేరు నాగేశ్వరరావుకు  దక్కకుండా ఖమ్మం టీడీపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ... కొత్తగూడెంలో టీడీపీ కార్యకర్తలు నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీ నమ్ముకుని ఉన్న కోనేరు కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని. నామ వ్యవహరించిన తీరు ఏకపక్షం గా ఉందని టీడీపీ నేత రాంబాబు మండిపడ్డారు.

కూకట్ పల్లి సీటు పెద్దిరెడ్డికే దాదాపు ఖరారు..?

Submitted by ganesh on Tue, 11/13/2018 - 18:47

                     తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట అన‌గానే ముందుగా అంద‌రికీ గుర్తుకొచ్చేది ఏంటంటే కూక‌ట్ ప‌ల్లి.. తెలంగాణలో టీడీపీ బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూక‌ట్ ప‌ల్లి మొద‌టి స్ధానంలో ఉంటుంది. దీంతో ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌పున టికెట్ కోసం చాలామంది పోటీ ప‌డుతున్నారు.  కూక‌ట్ ప‌ల్లి టికెట్ రేసులో చాలామంది పేర్లు వినిపించినా చివరకు ఈ టికెట్ ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి దక్కించుకున్నారని తెలుస్తోంది.

దిష్టిబొమ్మను దగ్ధం చేసిన శ్రీగణేష్ అనుచరులు

Submitted by ganesh on Tue, 11/13/2018 - 18:21

                     సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. కాంగ్రెస్ తరపున కంటోన్మెంట్ టికెట్ ను శ్రీగణేష్ కు కేటాయించకపోవడంతో... ఆయన అనుచరులు పీసీసీ ఛీప్ ఉత్తమ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కష్టపడి పనిచేసేవారిని పార్టీ గుర్తించడంలేదని, అక్రమాలు చేసేవారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్మకుంటుందని శ్రీగణేష్ ఆరోపించారు. ప్రజలు తన వెనుక ఉన్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్దిచెబుతారని శ్రీగణేష్ అన్నారు.

ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న రావాడి కాంతారావు

Submitted by ganesh on Tue, 11/13/2018 - 17:49

                ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మొట్టమొదటి నామినేషన్ దాఖలైంది. సుల్తాన్ పూర్ కు చెందిన రావాడి కాంతారావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే యువకుడైతేనే ఎక్కువ పని చేయగలుగుతారని, అందుకే రాజకీయాల్లోకి రావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని యువకులంతా తనలానే రాజకీయాల్లోకి రావాలని కాంతారావు పిలుపునిచ్చారు. అభివృద్ధి కోసం పాటుపడతానని, తనను గెలిపించాలని కాంతారావు కోరారు.

ఉప్పరపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థికి చుక్కెదురు

Submitted by ganesh on Tue, 11/13/2018 - 17:39

                 వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ కు చుక్కెదురయ్యింది. ఎన్నికల ప్రచారం చేస్తున్న అరూరి రమేష్ ను ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నారు. గత నాలుగేళ్ల పాలనలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలేదని మండిపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా... ఓట్లు ఎలా అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే సమస్యలు చెప్పడానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకుని,..

ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం చేసిన చిరుమర్తి

Submitted by ganesh on Tue, 11/13/2018 - 17:26

                  నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్... మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు దక్కింది. నకిరేకల్ టికెట్ ను టీడీపీకి కేటాయిస్తారనే అనుమానాలు తలెత్తడంతో...టికెట్ ను కాంగ్రెస్ పార్టీ తరపున చిరుమర్తికి కేటాయించాలని కోమటిరెడ్డి సోదరులు పట్టుబట్టారు. దీంతో నకిరేకల్ టికెట్ ను చిరుమర్తికి ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. చిరుమర్తి లింగయ్య.. అధిష్టానానికి అభినందనలు తెలుపుతూ పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి... కాంగ్రెస్ పార్టీ చేపట్టే సంక్షేమ పథకాలను చిరుమర్తి వివరించారు.

ఆశావర్కర్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన సీఎం

Submitted by ganesh on Tue, 11/13/2018 - 17:10

                      ఆశాకార్యకర్తల ఆత్మీయ సమేవశానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆశావర్కర్లకు జీతాలు పెంచామని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి సంక్షమమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ఆశావర్కర్ల పాత్ర అభినందనీమయ్యారు. పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తున్నామని సీఎం అన్నారు.