సాయం సంధ్యవేళ...వేడి వేడి చికెన్ పకోడా...

Submitted by ganesh on Sun, 12/16/2018 - 12:20

                         చల్లని సాయంత్రం కాస్త హాట్.. ఇంకాస్త ఘాటుగా  ఏదైనా తినాలనిపిస్తుంది. అందులోనూ నాన్ వెజ్ అయితే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. ఫుడ్ కు చాలా ఫేమస్ అయిన విజయవాడలో నాన్ వెజ్ స్నాక్స్ తినాలంటే మాత్రం మనం గాంధీనగర్ వెళ్లాల్సిందే. దాదాపు 4 దశాబ్దాలుగా నాన్ వెజ్ స్నాక్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన కోటేశ్వరరావు చికెన్ పకోడీ సెంటర్ పై ఓ స్మాల్ లుక్కేద్దాం..

క్రిస్మస్ శోభతో భాగ్యనగరం ముస్తాబు...

Submitted by ganesh on Fri, 12/14/2018 - 11:24

                    సర్వమతాల సమాహారానికి ప్రతిరూపమైన హైదరాబాద్ నగరం ఏ మతానికి చెందిన  పండగ వేడుకలు జరిగిన మతసామరస్యాన్ని చాటుతుంది. మొన్నటి వరకు ఎన్నికలతో హడావిడిగాఉన్న భాగ్యనగరం ఇప్పుడు పండగ వేడుకలకు ముస్తాబవుతుంది. అదేంటో చూసేదం.

మొబైల్ ఫోన్ లేని మనిషి ఉంటాడా..?

Submitted by ganesh on Sun, 12/09/2018 - 10:26

                   మనిషి లేనిదే మొబైల్ ఫోన్స్ లేవు... కాదు కాదు  మొబైల్ ఫోన్ లేనిదే మనిషి లేడు. అవసరాల కోసం కనిపెట్టిన.. మొబైల్స్ ని  ఇప్పుడు  వ్యసనంగా మార్చుకుంటున్నాడు మనిషి... ఎక్కాలు , లెక్కలను  గడగడచెప్పగలిగే ఆ తరం మనిషికి  ఇప్పుడు 10 అంకెల ఫోన్ నెంబర్ నే గుర్తుపెట్టుకోలేకపోతున ఈ తరం జనానకి చాలా తేడా ఉంది.

ఆ పక్షులకు ఈ గ్రామమన్నా...

Submitted by ganesh on Fri, 11/23/2018 - 13:41

                        విదేశీ అందాల పక్షులు వచ్చేశాయి. ఎల్లలు దాటుకుంటూ... దేశ సరిహద్దులు చెరిపేసుకుంటూ తరతరాలుగా తమకు బాసటగా నిలుస్తున్న ఆ గ్రామానికి వచ్చేశాయి. కొన్ని ఏళ్ళుగా ఆ కుగ్రామం తమకు సురక్షిత, ఆవాస ప్రాంతమని నమ్ముకున్నపక్షులు వచ్చేశాయి. వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ... తమ పుట్టింటికి వచ్చి వాలిపోయాయ్.

అసలు పబ్ అంటే ఏంటీ..?

Submitted by ganesh on Tue, 10/30/2018 - 14:49

                    కాలంతో పాటే మనం మారాలంటున్నారు బెడవాడ యువత. అసలు పబ్ అంటే ఏంటీ..? యూత్ మాత్రమే వెళ్తారా..? తాగుతారా..? మత్తులో చిందులు తొక్కుతారా..? పబ్ లో ఎం తప్పు జరుగుతుంది.. అది అసలు తప్ప..? కాదా..?అని తెలియకుండానే ప్రజలు గుడ్డిగా మాటలు నమ్ముతున్నారు.. నగరంలోని పబ్ లపై స్పెషల్ స్టోరీ..

మాంసాహారాన్ని త్యజించండి-శాఖాహారులుగా మారండి

Submitted by ganesh on Tue, 10/30/2018 - 12:47

                  మాంసాహారాన్ని త్యజించండి శాఖాహారులు గా మారండి అంటూ విశాఖపట్నం జిల్లా పిరమిడ్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహించారు..... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాకరుణ-శాఖాహార ర్యాలీ పేరిటి జిల్లాలో  41 రోజుల పాటు ఈ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

సముద్రతీరాల్లో మద్యం దొరుకుతుందా..?

Submitted by ganesh on Tue, 09/25/2018 - 10:07

                 సముద్రతీరాల్లో మద్యం ఇక సులభంగా దొరుకుతుందా..? పర్యాటకం పేరుతో ప్రజల ప్రాణాలను గాల్లో కలపడానికి పర్యాటక శాఖ సిద్ధం అవుతుందా..?  పర్యాటకుల ప్రాణాలతో ప్రభుత్వాలకు పని లేదా..? కేవలం ఆదాయం వస్తే చాలా..? మద్యం సేవించి వాహనాలు నడిపితే తప్పైనప్పుడు.. మద్యం సేవించి సముద్ర స్నానం చేయడం తప్పు కాదా..? పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లో మద్యం అమ్మకాలకు అనుమతులపై స్పెషల్ స్టోరీ.

ఎత్తైన కొండలు...పిల్లగాలులు...ప్రకృతి అందాలు...

Submitted by ganesh on Thu, 09/20/2018 - 10:50

               పచ్చటి చీరకట్టుకున్న ఎత్తైన కొండలు... చల్లగ వీచే పిల్లగాలులు..... అబ్బురపరిచే ప్రకృతి అందాలు... హాయిగొల్పే అటవీ సోయగాలు... ఉత్సాహపరిచే బోటు ప్రయాణం...అచ్చెరువొందించే సాహసక్రీడలు.... మాటలకందని ఆనందం...మనస్సు ఉప్పొంగే వాతావరణం... కనీసం ఒక్కసారైనా చూసి తీరాల్సిన చూడచక్కని పర్యాటక ప్రదేశం... అదే కంబాల కొండ. ఇంతకీ ఎక్కడుంది ఆ టూరిస్టిక్ స్పాట్...? హరిత పవనాలు వీచే ఆ రణమీయ ప్రాంతాన్ని మనమూ చూసొద్దాం పదండి...

పర్యాటక రంగానికి సరికొత్త విధానం

Submitted by ganesh on Mon, 08/27/2018 - 11:01

               రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ఆ శాఖ కొత్త విధానాలకు శ్రీకారం చుడుతుంది. చాలా చోట్ల పర్యాటక ప్రాంతాల్లో ఇబ్బందిగా మారుతున్న అతిథ్యానికి... ప్రత్యామ్నాయ మార్గాలు వెతకటం ద్వారా పర్యాటకుల  సంఖ్య పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది..కేరళలో విజయవంతమైన హోం స్టే విధానాన్ని అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో పర్యాటకాన్ని పరుగులు పెట్టించాలని భావిస్తోంది.