ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మకు నోటీసులు

ఓ వైపు తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండగా.. ఆ సంస్థకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. పన్ను బకాయిలు చెల్లించాలని ఇప్పటికే రవాణా శాఖ నోటీసులు పంపగా.. తాజాగా ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మకు పీఎఫ్ ప్రాంతీయ కమిషనర్‌ నోటీసులు పంపారు. ఆర్టీసీ కార్మికుల పీఎఫ్‌ బకాయిలపై ఆయన తాఖీదులు జారీ చేశారు. కార్మికుల పీఎఫ్‌ ఖాతాల్లో రూ.760 కోట్లు జమకాలేదని తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15లోగా పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆదేశించారు. పీఎఫ్ సొమ్ము ఎప్పటికప్పుడు చెల్లించకపోతే భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు.