ఆర్టీసీ కార్మికులు భయపడాల్సిన పనిలేదు : అశ్వత్థామరెడ్డి

సకల జనుల సామూహిక దీక్షలు అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడుతుందని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. కార్మికుల ఇళ్లలో పోలీసులు దాడులు చేస్తూ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. మహిళలని కూడా చూడకుండా అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఛలో ట్యాంక్ బండ్ కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులు భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ రోజు రాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులు హైదరాబాద్ కు తరలిరావాలని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.