ఆర్టీసీ కార్మికుల పిల్లలకు ఉచిత విద్య..

ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపిస్తున్న సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచుతూ, పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్ నెల జీతాలు ఈనెల 2వ తేదీన ఇవ్వనున్నట్లు, అంతేకాదు.. సమ్మె కాలానికి (52 రోజులు) సంబంధించిన వేతనాలు కూడా చెల్లిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. మహిళ ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు డ్యూటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళ ఉద్యోగులు కోరిన విదంగా ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. ఇలా మొత్తం 26 రకాల వరాలు ప్రకటించిన సీఎం.. తాజాగా, కార్మికుల పిల్లలకు ఉచితంగా విద్య అందించే వరం ప్రకటించారు. ఈ మేరకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. కార్మికుల పిల్లలకు ఉన్నత విద్య కోసం ఫీజులు చెల్లిస్తామని అన్నారు.