ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు నివేదిక

ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్ తీర్మానాన్ని ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47 కోట్లు చెల్లించాలన్న హైకోర్టు సూచనను పరిశీలించి అధ్యయనం చేస్తే రూ.2,209 కోట్ల దాకా తప్పనిసరి చెల్లింపులు, రుణాలు, నష్టాలుండగా ఈ రూ.47 కోట్లు ఏ మూలకూ సరిపోవని ప్రభుత్వం నివేదికలో వివరించింది. కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భీష్మించుకుని కూర్చుంటే చర్చలు సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ జరుపుతామని.. ఆర్టీసీ సమ్మెను విరమింపజేసే అధికారం తమకు ఉందా లేదా? ఒక వేళ సమ్మె విరమించకుంటే అక్రమమని తాము డిక్లేర్ చేయవచ్చా అన్నది పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది.