ఆసక్తికరంగా ‘రాగల 24 గంటల్లో’ ట్రైలర్

ఈషా రెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్, గణేశ్ వెంకట్రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రాగాల 24 గంటల్లో’. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్‌హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు చేతుల మీదుగా విడుదల చేశారు చిత్రయూనిట్. యాడ్ ఫిలిం మేకర్ రాహుల్ అనుకోకుండా మర్డర్ కావడం, ఆ కేసుని ఓ స్పెషల్ ఆఫీసర్ డీల్ చేయడం.. రాహుల్ భార్య తన భర్తని తానే చంపానని చెప్పడం.. ఇలా ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసేలా ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్ కట్ చేశారు. ఆమె చెప్పేది నిజమేనా? అందుకు కారణాలేమై ఉంటాయి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ముగించారు. ఇక నవంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Watch video here