ఇదేం బ్యాటింగ్ సామీ…?

క్రీజ్ లో నిలబడటానికి బౌలర్లను తికమకకు గురి చేస్తూ ఉంటారు బ్యాట్స్మెన్లు. తమ వింత బ్యాటింగ్ తో నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. తాజాగా ఇదే ప్రయత్నం చేసాడు ఆసిస్ ఆటగాడు జార్జ్ బైలీ. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో భాగంగా టాస్మేనియా-విక్టోరియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సరికొత్తగా బ్యాటింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. తలను మామూలుగానే ఉంచి శరీరం మొత్తాన్ని వికెట్ కీపర్ వైపు పెట్టి నిలబడ్డాడు. దీనితో బౌలర్ కి కాసేపు ఏం అర్ధం కాలేదు. బంతి వేయగానే సాధారణ స్థితిలో నిలబడ్డాడు. డిసెంబరు 2016 నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. టి20 స్పెషలిస్ట్ గా అతనికి పేరుంది. టి20 ప్రపంచకప్ ఫైనల్ లో ఆసిస్ జట్టుకి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు.