ఏపీలో కార్తీక శోభ

తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కార్తీకం. ఈ నెల సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలుదేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు గాలికి ఆరిన దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికంటేసమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రదమైన తీర్థాలు లేవని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అత్యంత ప్రవిత్రమైనది, మహిమానిత్వమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్నశివాలయాల్లోరుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు కృష్ణా, గోదావరిలోభక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.ఉభయ గోదావరి జిల్లాల్లో కార్తీక మాసం సందడి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం  సోమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి నదీ తీరంలోనిశైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలన్నీ హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో మార్మోగాయి. పురాణ ప్రాశస్థ్యం కలిగిన రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్‌, పుష్కరఘాట్‌లతో పాటు సరస్వతీ ఘాట్‌, గౌతమిఘాట్‌లు మరింత రద్దీగా కనిపించాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం కావడంతో తెల్లవారుజాము 2 గంటల నుండే కార్తీక పూజలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు పాదగయ