ఐఫోన్ వాడాలనుకుంటున్నారా..?

ఐఫోన్” ఈ ఫోన్ జీవితంలో ఒక్కసారి అయినా వాడాలి అనేది చాలా మంది యూత్ లో ఉండే ఒక చిన్న కోరిక. ఆర్ధిక స్తోమత సరిపడక దీనిని కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు దొంగతనాలు ఈ ఫోన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం సంస్థ సరికొత్త ఆలోచనతో ముందుకి వస్తుంది. ఐఫోన్ ని అద్దెకు ఇవ్వాలని సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఆలోచనగా ఉంది. నెలకు కొంత మొత్తం చెల్లిస్తేచాలు ఇష్టం ఉన్నన్ని రోజులు ఐఫోన్‌ను ఉపయోగించుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించనుంది. ఐ ఫోన్‌ తర్వాత మరేదైనా కొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి రిలీజ్‌ అయినా సరే ఐఫోన్‌ను వాపస్‌ ఇచ్చేది కొత్తది అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించనుంది సంస్థ. నెల నెలా ఐక్లౌడ్‌, ఐట్యూన్స్‌ వంటి సర్వీసులకు కూడా అద్దె చెల్లించేలా యాపిల్‌ సంస్థ షరతులు విధించనున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే టారిఫ్ లు విడుదల చేస్తారని టెక్ వర్గాలు అంటున్నాయి.