‘కనెక్ట్ టు ఆంధ్రా’ వెబ్ పోర్టల్ ను ఆవిష్కరించిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ”కనెక్ట్‌ టు ఆంధ్రా” వెబ్‌ పోర్టల్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ ఆవిష్కరించారు. సీఎస్ఆర్ నిధులు, దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. సీఎం ఛైర్మన్ గా, సీఎస్ వైస్ ఛైర్మన్ గా కనెక్ట్ టు ఆంధ్రా ఉంటుందన్నారు. కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్ ప్రారంభం తర్వాత ప్రవాసాంధ్రులను ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు. ”రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు. మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం కోసం ఎంతో కొంత మంచి చేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి” అని జగన్ పిలుపునిచ్చారు.