కర్తార్ పూర్ ప్రారంభోత్సవం .. పండిట్ రవిశంకర్‌కు పాక్ ఆహ్వానం..

కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్ ను ఆహ్వానించింది. ఈ మేరకు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంతకంతో కూడిన ఆహ్వాన పత్రం రవిశంకర్ అందింది. గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని పాక్‌లోని కర్తార్‌పూర్ వెళ్లే భక్తుల కోసం రెండు దేశాల ప్రభుత్వాలు సంయుక్తంగా కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించాయి. ఈ కారిడార్‌ను నవంబర్ 9న ప్రారంభించనున్న నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్‌కు పాక్ ఆహ్వానం పంపింది. పాక్ ఆహ్వానంపై స్పందించిన రవిశంకర్.. కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నవంబర్ 9న ఇతర కార్యక్రమాలకు షెడ్యూల్ ఇప్పటికే ఖరారైనందునే ప్రారభోత్సవానికి వెళ్లడం లేదని వివరించారు.