కాంగ్రెస్ కీలక నిర్ణయం…!

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ, శివసేన ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో భేటీ అయ్యి సేనకు మద్దతుపై అధ్యక్షురాలు సోనియా గాంధీ లోతుగా చర్చించారు. చివరకు ప్రభుత్వానికి బయటనుంచి మద్దతివ్వాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోనియా గాంధీ పేరుతో అధికారిక లేఖను విడుదల చేశారు. సేనకు ఇప్పటికే ఎన్‌సీపీ మద్దతు ఇచ్చింది. తాజాగా కాంగ్రెస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం మూడు పార్టీలకు 160 మంది సభ్యుల మద్దతు ఉంది.