కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తుంది : రజనీకాంత్

తాను బీజేపీ ట్రాప్‌లో పడనంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నూతన కార్యాలయ ప్రాంగణంలో ప్రముఖ దర్శకుడు కే.బాలచందర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రజినీ పాల్గొన్నారు. తిరుగు సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళ ప్రాచీన కవి తిరువళ్లువర్ చిత్రాన్ని బీజేపీ ట్వీట్‌ చేయడంపై చెలరేగిన వివాదంపై స్పందించాలని విలేకర్లు అడగ్గా.. ‘నాకు తిరువళ్లువర్ కు కాషాయ రంగు పులమాలని బీజేపీ చూస్తోందని..రజని వ్యాఖ్యానించారు. తిరువళ్లువర్ లాంటి గొప్ప రచయిత చుట్టూ రాజకీయం చేయకండి. అనవసర వివాదానికి తెరలేపకండి’ అని అన్నారు.

తంజావూరులో ప్రముఖ తమిళ రచయిత తిరువళ్లువర్ విగ్రహానికి హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్ కాషాయవస్త్రం కట్టి మెడలో రుద్రాక్ష మాలను వేసి పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటన బీజేపీ ప్రోద్బలంతోనే జరిగిందన్న రీతిలో రజినీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశంగా మారాయి.