కేసీఆర్ తీరు విచిత్రంగా ఉంది

సీఎం కేసీఆర్ ఆర్టీసీ విషయంలో వ్యవహరించిన తీరు విచిత్రంగా ఉందని.. కొత్తగా జ్ఞానోదయం అయినట్లు మాట్లాడుతున్నారని ఎంపీ అరవింద్ అన్నారు. సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికులు చర్చలకు పిలవాలని కోరినప్పటికీ స్పందించని కేసీఆర్, ఇప్పుడు మాత్రం ఏ మొహం పెట్టుకొని వారిని విధుల్లోకి తీసుకున్నారో చెప్పాలని అరవింద్ ప్రశ్నించారు. నిన్న కార్మికులతో లంచ్ మీటింగ్‌లో ఉన్న సోయి.. సమ్మె కాలంలో ఎటు పోయిందని ప్రశ్నించారు.

సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ హోం మంత్రి ఒక దద్దమ్మ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దిశా కేసును వ్యక్తిగతంగా పరిశీలిస్తానని కేటీఆర్ చెబుతున్నారంటే.. రాష్ట్ర హోం మంత్రి డమ్మినా? ఇదేమన్నా రాచరిక పాలనా? అని ఎంపీ ప్రశ్నించారు.