చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చు : హరీశ్‌రావు

చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. పల్స్‌ బాస్కెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉందని.. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు పెరిగేందుకు అన్నిరకాలుగా మద్దతు ఇస్తుందన్నారు. ఆరోగ్య రక్షణకు ప్రజలు యోగా, ప్రాణాయామం, సేంద్రీయ వ్యవసాయ పద్దతులు, రసాయనాలు వాడని ఆహారపు పంటలు వంటి వాటిపై దృష్టిసారించాలన్నారు.