టీ20ల్లో కోహ్లీని వెనక్కి నెట్టిన డేవిడ్ వార్నర్

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో పూర్తిగా విఫలమైన ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో మొత్తం 217 పరుగులు చేసిన అతడు మూడు మ్యాచ్‌ల్లో నాటౌట్‌గా నిలిచి పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, కివీస్‌ ఆటగాడు కొలిన్‌ మన్రో  మూడు టీ20ల సిరీస్‌లో.. మూడు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు. వార్నర్‌ నిన్న జరిగిన మూడో టీ20లో అర్ధశతకం బాదడంతో వారిద్దరినీ వెనక్కినెట్టాడు.