తొలి టీ20లో భారత్‌పై బంగ్లా గెలుపు

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోభారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ పై బంగ్లాదేశ్ గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులుచేసింది. అనంతరం 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగినబంగ్లాదేశ్.. మూడు బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతోవిజయం సాధించింది.