తోటి వారికి సహాయం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి..

కల్వకుంట్ల కవిత మార్గదర్శంలో స్కౌంట్స్ అండ్ గైడ్స్ స్కూల్స్ నిర్వహించటం గొప్ప విషయమన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నేడు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లోని దోమలగూడలో గల బీఎస్‌జీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, మాజీ ఎంపీ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. తోటి వారికి సహాయం చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్ధులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రభుత్వం.. విద్యా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.