త‌కిట త‌కిట‌.. అంటున్న రాహుల్ సిప్లిగంజ్

సాయిధరమ్ తేజ్, రాశీ ఖ‌న్నా జంటగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రతి రోజు పండగే’. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిన్న‌టితో చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసుకొని.. డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా తాజాగా త‌కిట త‌కిట… అంటూ సాగే పాట విడుద‌ల చేశారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ పాటని బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్ బాస్ 2 రన్నర్ గీతామాధురి కలిసి ఆలపించారు.