దోషులను కఠినంగా శిక్షించాలి : చంద్రబాబు

షాద్ నగర్ దిశ హత్య ఘటనపై తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని 44వ నెంబర్ జాతీయ బైపాస్ రహదారిపై చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్తూ కాసేపు కాన్వాయిని రోడ్డుపై ఆపారు. అక్కడ హాజరైన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడుతూ.. దిశ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని.. కఠిన శిక్ష పడితే తప్ప.. మిగతా వారు భయపడరన్నారు. నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో జరుగుతున్న లోటుపాట్లను గ్రహించి దోషులను త్వరగా శిక్ష పడే విధంగా చూడాలన్నారు. ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిదన్నారు.