నర్సుగా ట్రాన్స్ జెండర్…

దేశ చరిత్రలోనే సంచలనం జరిగింది… అన్బు రూబీ అనే ఓ టాన్స్‌జెండర్ మహిళకు తమిళనాడు ఆరోగ్య, సంక్షేమ శాఖ చరిత్రలో తొలిసారి నర్సు ఉద్యోగం లభించింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి, ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ నుంచి విడుదలైన నియామక ఉత్తర్వులు అందుకుంది. కొత్త నియామకాల్లో భాగంగా 5,224 మందికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయగా, వారిలో అన్బు రూబీ కూడా ఉండటంతో ఆమె హర్షం వ్యక్తం చేసింది. “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో నర్సుగా నియామకం జరిగిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళలను నేనే. ముఖ్యమంత్రికి, ఆరోగ్య మంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని పేర్కొంది.