పట్టా ఇచ్చేందుకు నిరాకరించారని నిప్పటించా..

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డి హత్యకు కారణమైన సురేశ్, హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం కోలుకుంటున్న సురేష్ స్టేట్మెంట్ ను అబ్దుల్లాపుర్ మెట్ పోలీసులు రికార్డ్ చేశారు. తాను పట్టా కోసం చాలాకాలంగా తహసీల్దారు విజయారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నానని, కానీ పట్టా ఇచ్చేందుకు ఆమె నిరాకరించారని సురేశ్ తన స్టేట్ మెంట్ లో స్పష్టం చేశాడు. సోమవారం కూడా విజయారెడ్డిని బతిమిలాడా కానీ తన భూమిపై కోర్టు కేసులు ఉన్నాయని, జెసి ఆదేశాలు ఉన్నాయని.. తాను ఏమి చేయలేనన్నారు. అయితే ఎన్ని సార్లు విజయారెడ్డిని రిక్వెస్ట్ చేసినా కుదరదని చెప్పడంతో పెట్రోల్ బాటిల్ తో వెళ్లి ఆమె రూమ్ కి డోర్ లాక్ చేసి నిప్పంటించానని చెప్పాడు. తాను కూడా చనిపోవాలనుకునే ఈ దారుణానికి పాల్పడ్డానని అన్నాడు. కాగా, సురేశ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని 302, 307, 333 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు.