పేలిన టిఫిన్‌బాక్స్, ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ నగరంలోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జిల్లెలగూడ విజయనగర్ కాలనీలోని చెత్త కుప్పల్లో నుంచి తీసిన టిఫిన్ బాక్స్‌లో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రమాదంలో మహిళతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు స్థానికంగా చెత్త ఏరుకునే వారిగా గుర్తించారు.