పోలవరం నిధులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం నుంచి కీలక ముందడుగు పడింది. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన రీఎంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని ఈ మధ్యనే సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. కేంద్రం నుండి రావాల్సిన రూ 5,600 కోట్ల గురించి నివేదించారు. అందులో భాగంగా కేంద్ర ఆర్దిక శాఖ రూ.1850 కోట్ల రీఎంబర్స్‌మెంట్ నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేసింది. ఈ నిధులు త్వరలోనే నాబార్డు ద్వారా ఏపీ ప్రభుత్వానికి జమ కానున్నాయి. మిగిలిన నిధుల గురించి కేంద్రం మరింత సమాచారం కోరినట్లు తెలుస్తోంది.