ప్రజలకు సీనియర్ నేత లేఖ…!

విధ్వంసానికి, వికృత చర్యలకు జగన్‌ 6 నెలల పాలనే కేరాఫ్‌ అడ్రస్‌గా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన ఈ మేరకు ప్రజలకు లేఖ రాసారు. దేవాలయాలను కూల్చేస్తున్నారు, వక్ఫ్‌భూములను ఆక్రమిస్తున్నారని, సొంత సామాజిక వర్గానికే జగన్‌ ప్రాధాన్యతనిస్తున్నారని, జగన్‌ తీరుతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని ఆయన ఆరోపించారు.

సౌకర్యాల పేరుతో జగన్‌ సొంతింటికి రూ. 17కోట్ల ప్రజా ధనం వాడుకున్నారని, వైసీపీ రంగుల కార్యక్రమానికి రూ. 1300 కోట్లు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. పోలవరంపై రివర్స్‌ టెండరింగ్‌ వెళ్లి రూ. 7500 కోట్లు నష్టం చేశారని, రూ. 4.84కు వచ్చే సౌరవిద్యుత్‌ను కాదని..

కర్ణాటక నుంచి రూ. 11.68కు కొంటూ దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సిమెంట్‌ కంపెనీల నుంచి రూ. 2500 కోట్లు జే-టాక్స్‌ వసూలు చేశారని, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని నిర్థాక్ష్యణ్యంగా తొలిగించారని ఆవేదన వ్యక్తం చేసారు. తక్కువ ధరకే ప్రభుత్వ స్థలాలు కాజేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు, అందరికీ అమ్మ ఒడి అని..ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే అంటున్నారని విమర్శించారు.