‘భీష్మ’ ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్

యంగ్ హీరో నితిన్‌, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బీష్మ’. సింగిల్‌ ఫరెవర్‌ అనేది ఈ సినిమా ట్యా్గ్‌ లైన్‌. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు. భీష్మ ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో రిలీజ్ అయిన టీజర్‌లో సినిమాలో హీరో హీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో హింట్‌ ఇచ్చారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

Watch Video Here